#Telangan Politics #Telangana

TELANGANA : LA huge open meeting aimed at the Lok Sabha elections .. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారీ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో తేదీని ప్రకటిస్తారు. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏఐసీసీ నేతలు విడుదల చేయనున్నారు.

కాంగ్రెస్ కు తుక్కుగూడలో సెంటిమెంట్ ఉంది. ఈ వేదికపైనే గత ఏడాది సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు హామీలను విడుదల చేశారు. తెలంగాణలో తొలిసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆరు హామీలు కీలక పాత్ర పోషించాయని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 14కు పైగా లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.

మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, దరఖాస్తుదారుల జాబితాను పార్టీ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలకు అందజేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకోసం బృందాలకు శిక్షణ ఇస్తారు. గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చే 40 లక్షల కుటుంబాలకు ఫిబ్రవరి నుంచి ‘జీరో బిల్లులు’ అందుతున్నాయి. 40 లక్షలకు పైగా కుటుంబాలు రూ.500 ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తున్నాయి. దాదాపు 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరి ఇళ్లకు, లబ్దిదారులకు చేరువై లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపుకోసం రంగంలోకి దిగుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *