Aadhar Update: Update security setting of Aadhaar ఆధార్ ఈ సెక్యూరిటీ సెట్టింగ్ అప్ డేట్ చేయకపోతే.. మీ అకౌంట్లలో మనీ ఖతం!

ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. చిత్రవిచిత్ర లింకులు పెట్టి నిలువునా దోచేసే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా కన్‌ఫ్యూజ్ చేసి కొల్లగొడతారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు.
ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. చిత్రవిచిత్ర లింకులు పెట్టి నిలువునా దోచేసే సైబర్ ముఠాలు వైఫైలా మన చుట్టూరే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎలాగోలా కన్‌ఫ్యూజ్ చేసి కొల్లగొడతారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. వింటే మాయమాటలు.. లేకుంటే బెదిరింపులు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు రాచకొండ పోలీసులు. ప్రజంట్ మీ వ్యక్తిగత సమాచారం కాపాడుకోవడం ఎంతో అవసరం. లేదంటే.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నప్పటికీ మంచినీళ్లు తాగినంత ఈజీగా కొల్లగొట్టేస్తారు. ఆధార్ కార్డును కలిగిన ప్రతి ఒక్కరూ.. డబ్బు నష్టపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓ సెట్టింగ్ అప్‌డేట్ చేసుకోవాలి.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)కి ఆధార్ నంబర్, ఫింగర్ ప్రింట్, ఓటీపీ, ఐరిస్ అవసరం అని గుర్తించాలి. AEPS ఉన్నవారు డబ్బును నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మీ ఆధార్‌లో సెక్యూరిటీ సెట్టింగ్ ఎనేబుల్ చేయాలంటే.. ఈ కింది విధంగా చేయండి :
* గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. యాప్ పైన ఉన్న ‘Register My Aadhaar’ కార్డ్ బటన్‌పై నొక్కండి. * ఇప్పుడు, యాప్ కోసం 4-అంకెల పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి. మీరు ఆధార్ నెంబర్, సెక్యూరిటీ క్యాప్చా నయోదు చేయాల్సి ఉంటుంది. (OTP మీ ఆధార్ కార్డు రిజిస్టర్ నంబర్‌కు వస్తుంది) * ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ ఖాతా తెవరబడుతుంది * ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి.. ‘Biometric Lock’పై నొక్కండి. * లాక్ బయోమెట్రిక్‌పై Tap చేశాక.. మీరు మళ్లీ సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేసి, ఆపై OTPని ఎంటర్ చేయాలి. * మీరు ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్‌లు లాక్ చేయబడతాయి
ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు వెంటనే.. 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు.