#Telangan Politics #Telangana

Hyderabad: Baldia seat for Congress if Majlis cooperates..Hyderabad: మజ్లిస్ సహకరిస్తే కాంగ్రెస్‌కు బల్దియా పీఠం.. త్వరలోనే మేయర్ చేరిక..?

కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందా ? ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ టీమ్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిరేపుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం.. ఈ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందా ? ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ టీమ్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిరేపుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం.. ఈ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపనుంది కాంగ్రెస్. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కీలకమైన జీహెచ్‌ఎంసీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు

ఇప్పటికే బీఆర్ఎస్‌ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఉన్న మోతే శ్రీలతరెడ్డితో పాటు కార్పొరేటర్లు విజయారెడ్డి, పూజిత, జగదీశ్వర్ గౌడ, సిఎన్ రెడ్డి, జితేందర్ ప్రేమ్ కుమార్, బొంతు శ్రీదేవి యాదవ్, స్వర్ణరాజ్, బానోతు సుజాత నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బల్దియాలో బలం పెంచుకుంటూ వచ్చిన కాంగ్రెస్ గ్రేటర్ పీఠంపై కన్నేసినట్లు కనిపిస్తుంది. స్పాట్..

అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తి కావాల్సిందే..

అయితే గ్రేటర్ పరిధిలో అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటివరకు అవిశ్వాసం పెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదు. దాంతో మేయర్‌నే తమ పార్టీలో చేర్చుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచన్నది కాంగ్రెస్ ఆలోచన. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రెండుసార్లు తనను కార్పొరేటర్‌గా గెలిపించిన బంజారాహిల్స్ కార్యకర్తల అభిప్రాయం తీసుకుని పార్టీ మారే అంశాన్ని ఆలోచిస్తాయని చెప్పారు. కానీ తాను పార్టీ మారను అని మాత్రం మేయర్ చెప్పకపోవడం త్వరలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుందన్న వాదనలకు బలాన్ని ఇస్తున్నాయి. బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వస్తారన్నది కాంగ్రెస్ వర్గాల మాట.

మజ్లిస్ సహకరిస్తే కాంగ్రెస్‌కు బల్దియా పీఠం

జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. గత GHMC ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం పలువురు కార్పొరేటర్లకు పార్టీలు మారడంతో ఈ లెక్కలు మారాయి. అయితే బల్దియాలో 42 స్థానాలతో బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటూ వచ్చింది. రాబోయే రోజుల్లో మజ్లిస్ కాంగ్రెస్‌కు అండగా ఉంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎంతో స్నేహంగా ఉంటున్న సీఎం రేవంత్‌కు అండగా ఉంటామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కొద్దిరోజుల క్రితం తెలిపారు. జీహెచ్‌ఎంసీలో కింగ్‌ మేకర్‌ పాత్రలో ఉన్న ఎంఐఎం కాంగ్రెస్‌కు సహకరిస్తే మేయర్ సీటు దక్కించుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే అందుకు మజ్లిస్ అంగీకరిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. జీహెచ్‌ఎంసీ పీఠాన్ని గతంలో కాంగ్రెస్, మజ్లిస్‌ పార్టీలు షేరింగ్‌ పద్ధతిలో పంచుకున్నాయి. రాబోయే రోజుల్లోనే ఇదే రకమైన ఫార్ములాతో ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయా ? అన్నది చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *