#Trending

AP News: The color of the sea has changed.. The people are surprised. ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.

సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. అసలు సముద్ర తీరం బ్లూగా ఎందుకు మారిందో.? ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు చూద్దాం..

సముద్రం ఎందుకో నీలిరంగులోకి మారింది. విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్లు కొత్త రూపంలో కనిపించింది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. ఉప్పాడ సముద్ర తీరంలో నీరు ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. సముద్ర తీర ప్రాంతమంతా బ్లూ రంగులోకి మారి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. నీలి రంగులోకి మారిన సముద్ర తీరం వెంబడి తెగ ఎంజాయ్ చేశారు. ఆకాశం, సముద్రం ఏకమైనట్లు కనిపించిన దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. విదేశాల్లో మాత్రమే ఉండే నీలు రంగు సముద్రపు దృశ్యాలు కాకినాడ ఉప్పాడ తీరంలో కనువిందు చేయడంతో ఆశ్చర్యపోయారు పర్యాటకులతోపాటు స్థానికులు. ఎప్పుడూ ఎరుపు రంగులో కనిపించే సముద్ర తీరం నీలిరంగులోకి మారి పర్యాటకులను ఆకట్టుకుంది.

సాధారణంగా సముద్ర తీర ప్రాంతం నీలి రంగులోనే ఉంటుంది. వర్షాకాలంలో వరద నీరు సముద్రంలో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. కానీ.. మిగతా అన్ని రోజుల్లోనూ దాదాపు లేత నీలి రంగులోనే ఉంటుంది. ఇదిగో.. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు ఒక్కసారి గమనిస్తే.. మొన్నటివరకు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఇలానే ఉండేది. కానీ.. నిన్న సడెన్‌గా బ్లూ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ముదురు నీలం రంగులోకి మారి.. అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చింది. దాంతో.. బ్లూ రంగులోకి మారిన ఉప్పాడ సముద్ర తీరాన్ని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఉప్పాడ సముద్ర తీరం బ్లూ రంగులోకి మారిన దృశ్యాలను చూసి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక.. గతంలోనూ ఉప్పాడ సముద్ర తీరంలో నీరు రంగు మారింది. మొత్తంగా.. అప్పుడప్పుడు ఉప్పాడ సముద్ర తీరంలో నీరు రంగులు మారుతుండడంపై చర్చలు సాగుతున్నాయి. సముద్రం రంగులు మారడం సాధారణమే అంటున్నారు ఓషనోగ్రాఫర్లు. సముద్ర గర్భంలో ఏముంది అనే దానిపై.. ఉపరితల రంగు ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.

AP News: The color of the sea has changed.. The people are surprised. ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.

PM Modi: Dedicating this award to 140

AP News: The color of the sea has changed.. The people are surprised. ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.

Delhi and Hyderabad cities went dark for

Leave a comment

Your email address will not be published. Required fields are marked *