#Top Stories

Delhi liquor Policy Case MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..

Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. ED అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సంజీవ్ ఖన్నా, సుందరేశ్, బేలా ఎం. త్రివేది ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

బెయిల్ గురించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే,బెయిల్‌ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కగా.. పిటిషన్‌లో లేవనెత్తిన ఇతర అంశాలపై ధర్మాసనం విచారణకు అంగీకరించింది. దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

Delhi liquor Policy Case MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..

Fight for 40 rupees. Shop owner died

Leave a comment

Your email address will not be published. Required fields are marked *