#ANDHRA ELECTIONS #Elections

ANDHRA POLITICAL : Pawan Kalyan met with Chandrababu చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు.

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు. 

ఇప్పటికే తెదేపా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో తెదేపా వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 27 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా పవన్‌ ప్రణాళికలు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహంపై ఇరుపార్టీల అధినేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ANDHRA POLITICAL : Pawan Kalyan met with Chandrababu చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Congress party What about the Lok Sabha

Leave a comment

Your email address will not be published. Required fields are marked *