#Top Stories

Lok Sabha Elections 2024: Pil in the Supreme Court on the free promises of political parties! ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. పొలిటికల్‌ పార్టీల ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టులో పిల్‌!

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం (మార్చి 21) విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్థానాల ప్రకటనలు రాజ్యాంగ ఉల్లంఘనగా పిటిషన్‌ పేర్కొన్నారు. వీటిపై తక్షణమే నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ..

న్యూఢిల్లీ, మార్చి 21: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురువారం (మార్చి 21) విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్థానాల ప్రకటనలు రాజ్యాంగ ఉల్లంఘనగా పిటిషన్‌ పేర్కొన్నారు. వీటిపై తక్షణమే నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిల్‌ను దాఖలు చేశారు. ఈ పరిణామం ఏప్రిల్ 19న జరనున్న సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల సమయాల్లో ఉచిత వాగ్థాన ప్రకటనలు చేసే పార్టీల చిహ్నాలను స్తంభింపచేయాలని, అటువంటి పద్ధతుల్లో ప్రచారం చేసే పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలా ఎన్నికల సంఘం చర్యాలు తీసుకోవాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. పిటిషనర్‌ తరపు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా వాదనలు వినిపిస్తూ..

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్ధేశించిన ప్రజాకర్షక వ్యూహాలకు చరమగీతం పాడాలని, వీటిని పూర్తిగా నిషేధించాలని. ఇటువంటి పద్ధతులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాయని, ఎన్నికలకు న్యాయవిఘాతం కలిగిస్తాయని వాదించారు. ఎన్నికలకు ముందు ప్రజా నిధులతో అహేతుకమైన ఉచితాలను అందజేస్తామని ఓటర్లను మభ్యపెట్టడం ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీయడం అవుతుందనే విషయమాన్ని కోర్టు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఓటర్ల మద్దతు పొందేందుకు రాజకీయ పార్టీలు ఉచితాలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని, ఇది ప్రజా నిధుల ఖర్చుతో ఓటర్లకు లంచం ఇవ్వడంతో సమానమని అన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను నిలబెట్టుకోవడానికి, ఎన్నికల పవిత్రతను కాపాడుకోవడానికి ఈ అనైతిక ఆచారాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి ఒక్కానించారు.

ప్రస్తుతం దేశంలో ఎనిమిది జాతీయ రాజకీయ పార్టీలు, 56 రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. సుమారుగా 2,800 నమోదుకాని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వచ్చే 18వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. తొలిదశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియపై ఉచితాల ప్రభావం పెరుగుతుంది. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువల సమగ్రతను కాపాడేందుకు కోర్టును న్యాయపరమైన జోక్యాన్ని కోరారు. ఈ మేరకు పిటీషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

Lok Sabha Elections 2024: Pil in the Supreme Court on the free promises of political parties! ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. పొలిటికల్‌ పార్టీల ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టులో పిల్‌!

Voter Details: Find out easily if your

Leave a comment

Your email address will not be published. Required fields are marked *