#Telangan Politics #Telangana

RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు. ఇటీవల BRS-BSP పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గజ్వేల్‌లోని ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి అర్థం చేసుకోండి, వేదిక ఏదైనా తన లక్ష్యం మాత్రం ఒక్కటే అంటున్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. తెలంగాణ వాదం…బహుజన వాదం… రెండు ఒక్కటే అన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. రెండింటి లక్ష్యాలూ విముక్తి కోసమేనన్నారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్‌ విముక్తి కల్పించారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బిఆర్ఎస్ అధికారంలో లేకున్నా కేసిఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధన కోసం పోరాడుతానన్నారు.

సీఎం రేవంత్ టీఎస్‌పీఎస్సీ చైర్మర్‌ ఆఫర్‌ ఇస్తే.. తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ గేట్లు తెరిస్తే అందులోకి వెళ్లడానికి తానేమీ గొర్రె మందలో ఒకడ్ని కాదన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌. అసమర్థులు, స్వార్థపరులే గొర్రెల మందలా అలా వెళ్తారని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డిలాగే తాను కూడా పాలమూరు బిడ్డేనని… తనకు వార్నింగ్‌లు ఇవ్వొద్దని కౌంటర్‌ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌లో చేరడం వెనుక ఎలాంటి స్వార్థం లేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌. తెలంగాణ పునర్‌ నిర్మాణం కోసమే బీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు. ప్యాకేజీ కోసమే అయితే అధికార పార్టీ వైపే వెళ్లేవాడిని కదా అంటూ ప్రత్యర్థులకు లాజికల్‌గా కౌంటర్‌ ఇచ్చారు ప్రవీణ్‌కుమార్‌. కాగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు.. ప్రవీణ్ కుమార్‌ను సాధరంగా పార్టీలోకి స్వాగతించారు. “డాక్టర్ ఆర్‌ఎస్‌పి గారూ బీఆర్‌ఎస్‌లోకి స్వాగతం.. జై తెలంగాణ..జై భీమ్” అని ఆయన పోస్ట్ చేశారు.

RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

TDP : More meetings in the name

RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

Who is the MP candidate in that

Leave a comment

Your email address will not be published. Required fields are marked *