#ANDHRA ELECTIONS #Elections

TDP : More meetings in the name of ‘Prajagalam’.. TDP’s decision ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని.. ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. పోలీసుల ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *