#Top Stories

Emergency landing of warplanes on national highways of Bapatla district. బాపట్ల జిల్లా నేషనల్ హైవేలపై యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్..

బాపట్ల జిల్లా కొరిశాపాడు మండలం పిచ్చికలగడిపాడు వద్ద జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. ఇదేదో ఎమర్జీన్సీ ల్యాండింగ్ అనుకునేరు. రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు అంతే. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయిల్ రన్ నిర్వహించారు.

హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఏపీలో విజవంతమైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర… అలాగే బాపట్ల జిల్లా కొరిశపాడు హైవే మీద రెండుచోట్ల విజయవంతగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు.

ఉగ్రదాడులు, విపత్తుల సమయంలో సైనిక చర్యలు, సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈ హైవే కమ్‌ రన్‌వేలపై.. ఇప్పటికే తొలి ట్రయల్‌ రన్‌ నిర్వహించగా తాజాగా రెండో ట్రయల్‌ రన్‌ను సూపర్‌ సక్సెస్‌ చేశారు అధికారులు. పోయిన సంవత్సరం రన్‌వేపైకి దిగకుండా విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించగా, ఇవాళ రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్‌ రన్‌లో నాలుగు సుఖోయ్‌ యుద్ద విమానాలు, రెండు హక్‌ యుద్ద విమానాలు, రెండు కార్గో యుద్ద విమానాలు పాల్గొన్నాయి… ఈ ట్రయల్‌ రన్‌ కోసం జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు వాహనాలను దారి మళ్ళించారు. రన్​వేపైకి ఇతరులెవరూ రాకుండా బారికేడ్లు కట్టారు.

ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అత్యవసర పరిస్తితుల్లో ఇక్కడ యుద్ద విమానాలు ల్యాండింగ్‌ చేసేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు.  అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన… దృశాలు కనువిందు చేశాయి.  అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా.. దేశవ్యాప్తంగా 13 రన్‌వేలను నేషనల్ హైవేలపై సిద్ధం చేస్తున్నారు. దేశంలోని 28 ప్రాంతాల్లో ప్రధానమంత్రి గతిశక్తి మిషన్ కింద ఈ విధానంలో రన్‌వేల నిర్మాణాన్ని కేంద్రం మొదలెట్టగా.. 13చోట్ల పనులు కంప్లీట్ అయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *