Chevella MP Ranjith Reddy resigns బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో చేరికల పర్వం ఊపందుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు పార్టీ మారగా, తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో చేరికల పర్వం ఊపందుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు పార్టీ మారగా, తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ ప్రకటించించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కు రాజీనామా లేఖను సమర్పించినట్లు తన అభిమానులు, ప్రజలకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నానని, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజీనామా సమర్పించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
అధినేత కే చంద్రశేఖర్ రావుకు రాసిన రాజీనామా లేఖలో పార్టీ కల్పించిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాల ప్రజలను ప్రభావితం చేసే కీలక సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందని తెలిపారు. నా సామర్థ్యంపై మీకున్న నమ్మకమే నా పార్లమెంటరీ నియోజకవర్గమైన చేవెళ్ల ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడానికి నాకు శక్తినిచ్చిందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలనే కఠిన నిర్ణయానికి వచ్చాను. బరువెక్కిన హృదయంతో బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి సభ్యత్వాన్ని వదులుకుంటున్నా. నా హయాంలో కాంగ్రెస్ పార్టీ అందించిన మద్దతుకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.