#Telangan Politics #Telangana #Telangana News #Top Stories

PM Modi Hyderabad : Today Modi visit Hyderabad నేడు హైదరాబాద్ కు మోడీ రాక.. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 7.40 గంటల నుంచి 8.10 గంటల వరకు బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకు ప్రధాని ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రసూల్ పురా, పీఎన్ టీ జంక్షన్, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్ భవన్ ఎంఎంటీఎస్ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, వీవీ స్టాచ్యూ జంక్షన్ ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేయడం లేదా దారి మళ్లిస్తారు.

సోమవారం రోజున ప్రధాని మోడీ రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వెళతారు. హైదరాబాద్ లోని వివి స్టాచ్యూ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంఎంటిఎస్ రాజ్ భవన్, పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, హెచ్ పిఎస్ అవుట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్ టి ఫ్లైఓవర్ లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

కాగా శుక్రవారం హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించి బీజేపీ నాయకుల్లో జోష్ నింపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మల్కాజిగిరిలో రోడ్డు షో జరిగింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రధాని మోదీ వెంట ఉన్నారు. ప్రధాని పర్యటన, రోడ్ షో నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2019 లో తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు గాను బిజెపి నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి పార్టీ 12 కంటే ఎక్కువ స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది.

PM Modi Hyderabad : Today Modi visit Hyderabad నేడు హైదరాబాద్ కు మోడీ రాక.. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Baby born with 4 inch tail in

Leave a comment

Your email address will not be published. Required fields are marked *