PAWANKALYAN : Ustaad Bhagat Singh Movie Updates : ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. నెటిజన్స్ రియాక్షన్స్ ఏంటంటే..

డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్లుగా ఆయన నటిస్తోన్న సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. చివరిసారిగా బ్రో సినిమాతో థియేటర్లలో సందడి చేశారు పవన్. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్స్ పై మరో అప్డేట్ రాలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వేగంగా షూటింగ్ జరిపారు. అంతే వేగంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానులకు మరింత బూస్ట్ ఇచ్చారు. ఇక ఈసారి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవర్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ కనిపించనున్నారని గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీపై మరింత పైప్ వచ్చింది. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక అటు హరీష్ కూడా రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టేశారా ? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎన్నోసార్లు ట్విట్టర్ లో మొర పెట్టుకున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి త్వరలో ఊహించని అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్ చేశారు. అయితే ఇన్నాళ్లు సినిమా గురించి ఎలాంటి పోస్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్.. ఇప్పుడు సడెన్ గా అప్డేట్ ఇస్తాము అని ట్వీట్ చేయడంతో ఫ్యా్న్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తారు ?..వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ అప్డేట్ అంటూ పవన్ అభిమానులను ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.