Murder Mubarakr Released in OTT : ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్‌లోనే ఆసక్తిని రేకెత్తించిన మర్డర్ ముబారక్ డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజైంది. శుక్రవారం (మార్చి 15) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మర్డర్ ముబారక్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
మర్డర్ మిస్టరీగా..
అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా మర్డర్ ముబారక్ సినిమాను తెరకెక్కించారు. డోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ధనవంతులు మెంబర్స్ గా ఉండే ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్‌లో అనుకోకుండా ఓ హత్య జరుగుతుంది. ఈ హత్య వెనుక ఉన్న కారణాలను, మర్డర్ ఎవరు చేశారు అనే మిస్టరీ ఛేదించేందుకు భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతాడు. మరి అతను ఈ కేసును ఎలా పరిష్కరించాడు. ఈ మర్డర్ మిస్టరీ వెనక ఎవరి హస్తం దాగుంది? అనేది తెలుసుకోవాలంటే మర్డర్ ముబారక్ సినిమా చూడాల్సిందే. క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్.