KTR had an argument with ED officials : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వివాదం

ఢిల్లీ లిక్కర్ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. దీంతో కేటీఆర్, హరీష్‌రావు తదితర నేతలు కవిత ఇంటికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు.
అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్
కావాలని శుక్రవారం వచ్చారు ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కావాలని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.