RGV entering in the Politics : ఏపీలో ఊహించని పరిణామం.. ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆర్జీవీ.. అక్కడినుంచే పోటీ

ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ పై.. అక్కడి రాజకీయనా నాయకుల పై సెటైర్లు వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల వ్యూహం సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్మ. ఇప్పుడు శపధం అనే సినిమాను తీసుకురానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సడన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ షేర్ చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు.. ఎలాంటి బాంబు పేల్చుతారో చెప్పడం కష్టమే.. ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ పై.. అక్కడి రాజకీయనా నాయకుల పై సెటైర్లు వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల వ్యూహం సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్మ. ఇప్పుడు శపధం అనే సినిమాను తీసుకురానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సడన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
సడన్ గా తీసుకున్న నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే ఆర్జీవీ ఇప్పుడు ఎందుకు ఈ ట్వీట్ చేశారు అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.
అయితే ఆర్జీవీ పవన్ పై సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశారా..? లేక పవన్ కు పోటీగా ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా.? అని అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. లేదా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా..? అసలు ఈ ట్వీట్ కు అర్ధం ఏంటి అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.