#Top Stories

CAA: There is no going back in that matter..Amit Shah ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమిత్‌ షా..

పౌరసత్వ సవరణ చట్టంపై రగడ మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. CAAపై విపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు షా. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం CAA అమల్లోకి తీసుకొచ్చామన్నారు…

CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఎట్టిపరిస్థితుల్లో శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుందన్నారు. అయితే తమ రాష్ట్రంలో CAAను అమలు అసాధ్యమన్నారు కేరళ సీఎం విజయన్‌. CAAను వ్యతిరేకించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసాన్ని పాక్‌ హిందూ శరణార్ధులు ముట్టడించారు.

పౌరసత్వ సవరణ చట్టంపై రగడ మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. CAAపై విపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు షా. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం CAA అమల్లోకి తీసుకొచ్చామన్నారు. 2014కు ముందు పాకిస్తాన్‌, అప్ఘనిస్తాన్‌ , బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చాం.

కోవిడ్‌ కారణంగా కాస్తా ఆలస్యమైందన్నారు. ఎన్నికల సమయంలో తీసుకొచ్చారనే విపక్షాల ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. దేశ విభజన సమయంలోనే ముస్లింలకు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ భూభాగాలు ఇచ్చామని, కొత్తగా వారికి CAAలో చోటు కల్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇది బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఎంతమాత్రం కాదన్నారు అమిత్‌షా.

ఇదిలా ఉంటే మరోవైపు విపక్షాల మాత్రం CAAను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో ఎట్టి పరిస్థితుల్లో CAA అమలు కాదన్నారు సీఎం విజయన్‌. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా CAAను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశీయులకు భారత పౌరసత్వం ఇవ్వడంతో దేశంలో నేరాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

CAAపై కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్ధులు ఆయన నివాసాన్ని ముట్టడించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బారికేడ్లను తొలగించేందుకు వాళ్లు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా శరణార్ధులు నినాదాలు చేశారు. బారికేడ్లు తొలగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

CAA: There is no going back in that matter..Amit Shah ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమిత్‌ షా..

TG change instead of TS for Telangana

CAA: There is no going back in that matter..Amit Shah ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమిత్‌ షా..

Chelonitoxism: The Meat of turtles |  ఆ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *