Election Campaign 2024 : Ramp walk politics in the country.. Who is the trend setter..

ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు.. ప్రజెంట్ ఇండియాలో ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు. ఈ న్యూట్రెండ్‌కి ట్రెండ్ సెట్టర్ ఎవరు?. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు. ర్యాంప్ వాక్ సభల వెనుక ఉన్న మర్మమేంటి? ఇది ప్రజెంట్ దేశంలో పొలిటికల్ సభలో కనిపిస్తున్న న్యూ ట్రెండ్. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ర్యాంప్ వాక్ రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గతంలో Dఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్ వాక్ సభలవైపు మళ్లాయి. దేశంలో ఇప్పుడు ఏ ఎన్నికల ప్రచారవేదిక చూసినా ట్రెండ్‌గా మారింది.
ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు.. ప్రజెంట్ ఇండియాలో ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు. ఈ న్యూట్రెండ్‌కి ట్రెండ్ సెట్టర్ ఎవరు?. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు. ర్యాంప్ వాక్ సభల వెనుక ఉన్న మర్మమేంటి? ఇది ప్రజెంట్ దేశంలో పొలిటికల్ సభలో కనిపిస్తున్న న్యూ ట్రెండ్. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ర్యాంప్ వాక్ రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గతంలో Dఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్ వాక్ సభలవైపు మళ్లాయి. దేశంలో ఇప్పుడు ఏ ఎన్నికల ప్రచారవేదిక చూసినా ట్రెండ్‌గా మారింది. ర్యాంప్ వాక్‌ల ద్వారా కార్యకర్తలు, అభిమానులకు చేరువవుతున్నారు నాయకులు. సభలకు వెళ్లి తన నాయకుడ్ని దగ్గర నుంచి చూశామనే ఫిలింగ్ తెస్తున్నారు. అయితే ఈట్రెండ్‌కి రెండేళ్ల క్రితమే ఆజ్యం పడింది. ర్యాంప్ వాక్ రాజకీయాలను తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంట్రొడ్యూస్ చేస్తే .. ఆతర్వాత చంద్రబాబు, పవన్ మీటింగ్‌ల్లో కనిపించాయి. తర్వాత మళ్లీ కనుమరుగైపోయాయి. పొలిటికల్ సభల్లో ర్యాంప్ వాక్‌లను మరోసారి తెరపైకి ఈమధ్య కాలంలో వెలుగులోకి తెచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సిద్ధం సభలతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. వైజాగ్, దెందులూరు, రాప్తాడు, మెదరమెట్లలో నిర్వహించిన నాలుగు సభల్లోను ర్యాంప్ వాక్ చేశారు. స్పీచ్ ముగిసిన తర్వాత కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వారి దగ్గరకు చేరువయ్యారు. సభకు వెళ్లి తమ నేతను దగ్గర నుంచి చూశామనే ఫీలింగ్ తీసుకొచ్చారు.
రాజకీయ సభల్లో ర్యాంప్ వ్యాక్‌ను బెంగాల్‌లోను కంటిన్యూ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. మొన్న కలకత్తా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ జనగార్జన్ ర్యాలీలో ర్యాంప్ వాక్ చేశారు టీఎంసీ ఛీప్ మమతాబెనర్జీ. తన ప్రసంగం పూర్తయిన తర్వాత 42 మంది లోక్‌సభ అభ్యర్థులతో కలిసి ర్యాంప్‌పై నడిచారు. పార్టీ మద్దతుదారులకు అభివాదం చేశారు మమతా బెనర్జీ. ఇదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నాయి తెలంగాణ రాజకీయ పార్టీలు. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ మహిళా శక్తి పథకం ప్రారంభోత్సవ సభలోను సీఎం రేవంత్, మంత్రులు ర్యాంప్ వాక్ చేశారు. అభివాదం చేస్తూ మహిళా కార్యకర్తల్లో జోష్ తెచ్చారు. కరీంనగర్ కదనభేరి సభలోను బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ ర్యాంప్ వాక్ చేశారు. తుంటి ఎముక సర్జరీ చేయించుకొని కొలుకున్నా.. ఇంకా చేతి కర్ర సాయంతోనే నడుస్తున్నారు కేసీఆర్. చేతికర్ర సాయంతోనే ర్యాంప్ వాక్ చేశారు. బీఆర్ఎస్ అభిమానులకు అభివాదం చేశారు.