#Cinema

Once again Rashmika deepfake Video. :మరోసారి డీప్‌ఫేక్‌ బారిన పడిన రష్మిక.. అసభ్యకరంగా ఎడిట్‌ చేసి.. వైరల్‌ చేశారుగా!

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సెలెబ్రీటీలకు శాపంగా మారింది. ఈ సరికొత్త టెక్నాలజీని ఎక్కువ శాతం చెడు పనులకే ఉపయోగిస్తున్నారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు తయారు చేసి వాటిని నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి సంబంధించిన ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక, కాజోల్‌, కత్రినాతో పాటు పలువురు హీరోయిన్లు మరో డీప్‌ఫేక్ బారినపడ్డారు.

 గతంలో రష్మికకు సంబంధించిన ఫేక్‌ వీడియో వైరల్‌ కావడంతో డీప్‌ఫేక్‌పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అమితాబ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు దీనిపై సీరియస్ అయ్యారు. ఇలాంటివి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాంటి ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

అయినా కూడా సెలబ్రెటీలకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా రష్మిక మరోసారి డీప్‌ఫేక్‌ బారిన పడింది. ఆమెకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో రష్మిక అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తుంది. డ్యాన్స్‌ చేస్తున్న ఓ యువతి ముఖాన్ని  ఎడిట్‌ చేసి రష్మిక ఫేస్‌ని యాడ్‌ చేశారు. ఈ వీడియోపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్‌ వీడియోలు సృష్టించొద్దని రష్మిక మందన్న అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ఓ లేడి ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌తో పాటు పుష్ప 2లో నటిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *