#Trending

Kajal Agarwal shocked : కాజల్‌కు షాకిచ్చిన ఆకతాయి.. ఏం చేశాడంటే

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట అన్నట్లుగా తయారైంది కాజల్ పరిస్థితి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెకు ఓ ఆకతాయి అత్యుత్సాహంతో చేదు ఘటన ఎదురైంది.

ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట అన్నట్లుగా తయారైంది కాజల్ పరిస్థితి. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెకు ఓ ఆకతాయి అత్యుత్సాహంతో చేదు ఘటన ఎదురైంది. దశాబ్ద కాలంగా తెలుగులో దాదాపు అందరు స్టార్లతో సినిమాలు చేసిన చిన్నది ఇక్కడ స్టార్ స్టేటస్ ను అనుభవించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడే గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం సెలక్టివ్ గా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న కాజల్ రెండు తెలుగు రాష్ట్రాలలో తనకున్న ఇమేజ్ ను మాత్రం అలానే కాపాడుకుంటోంది.

తాజాగా.. హైదరాబాద్ లో ఓ బట్టల షాప్ ప్రారంభోత్సవానికి కాజల్ ముఖ్య అతిథిగా హజరైంది. ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు, యువకులు అమెను చూడడానికి ఒక్కసారిగా ఎగబడ్డారు. అంతేగాక ఆమెతో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు జనసంద్రాన్ని తలపించింది. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది చాలా మందే అక్కడ ఉన్నప్పటికీ సడన్ గా ఓ ఆకతాయి ఎక్కడినుంచో వచ్చి కాజల్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కాజల్ నడుమును టచ్ చేయబోయాడు దీంతో వెంటనే అప్రమత్తమైన కాజల్ ఏయ్ ఏంటీ.. అంటూ గట్టిగా మందలించి పక్కనే ఉన్న సెక్యూరిటీకి చెప్పగా ఆ ఆకతాయిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి చల్లబడింది. ఈ ఘటనతో సెలబ్రిటీలతో అభిమానుల వైఖరి ఎలా ఉంటుందనేది మరోసారి బయటపడగా.. హీరోయిన్స్ ఇలా పబ్లిక్ ప్లే‌స్‌లలోకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ ఘటన తెలియజేస్తుంది.

Kajal Agarwal shocked : కాజల్‌కు షాకిచ్చిన ఆకతాయి.. ఏం చేశాడంటే

Fans of top actors who have fight…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *