అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ భేటీ.. ఎన్డీయేలోకి తెదేపాను ఆహ్వానించిన భాజపా

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు
దిల్లీ : భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్డీయేలోకి తెదేపాను భాజపా ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి తెదేపా హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం.