ఆ గాయం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సమంత

సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
‘మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆమె ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ మ్యాగజైన్ కవర్‌ఫొటోపై సమంత లుక్స్ చూసి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ‘గ్లామర్‌గా ఉన్నావు’ అని ఒకరు అనగా..‘నిజంగా సమంతనేనా.. ఏఐ ఇమేజా’ అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు. ‘మాకు పాత సమంతనే కావాలంటూ’ పలువురు కోరుతున్నారు.
గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో పలకరించిన సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ (ఇండియన్ వెర్షన్) విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ హీరో. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. దీనితో పాటు ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు.