#ANDHRA PRADESH #Telangana #Trending

మహా శివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువ జామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రివేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీచాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *