రాజకీయాల్లోకి షమి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?

టీమ్ఇండియా స్టార్ బౌలర్ షమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి భాజపాలో చేరనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి.
ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే భాజపా (BJP) అధిష్ఠానం ఈ క్రికెటర్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని, అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని కమలం వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని భాజపా భావిస్తోంది. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం బసిర్హత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే.ఇదిలా ఉండగా.. ఇటీవలే షమి తన కుడికాలి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్ మీడియాలో వెల్లడించగా.. మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే షమి తన కుడికాలి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్ మీడియాలో వెల్లడించగా.. మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.