#Andhra Politics #Elections

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ?, ఆ నియోజకవర్గమేనా!

ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అనూహ్యంగా వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పద్మ ఎన్నికల్లో పోటీ చేయడానికే పదవికి గుడ్ బై చెప్పారంటున్నారు.

ప్రధానాంశాలు:

  • ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి పద్మ రాజీనామా
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపారు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పని చేస్తానన్నారు. మహిళల సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని తీసుకుంటోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చని.. ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి ఆ అభిప్రాయం ఉండొచ్చన్నారు. కానీ అది నిజం కాదని.. ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పని చేస్తూనే ఉంటుందన్నారు. అంతేకాదు ఎన్నికల్లో బరిలో పోటీ చేయడంపై వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *