తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదు.. రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం పెరిగిపోయింది. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, హరీశ్ రావుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యతిరేఖించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్టును ఆయన షేర్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బగొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవని వ్యక్తి.. ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.