March 7th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

11:33 AM, Mar 7th, 2024
ముద్రగడను కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి
- కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి
- ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
11:25 AM, Mar 7th, 2024
ముద్రగడ నివాసానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి
- కిర్లంపూడి లో కాపు ఉద్యమనేత ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
- మరికాసేపట్లో ముద్రగడను కలవనున్న వైఎస్సార్‌సీపీ రిజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి
10:43 AM, Mar 7th, 2024
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ
- టిక్కెట్ కోసం కొట్టుకుంటున్న ఉమా,వసంత,బొమ్మసాని
- వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు
- రగిలిపోతున్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు
- వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా, అతని వర్గం
- వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్న మైలవరం టీడీపీ నేతలు, శ్రేణులు
- నేను లోకల్.. నేనే లోకల్ అంటున్న బొమ్మసాని సుబ్బారావు
- ఉమా, వసంతలకు పోటీగా బలప్రదర్శన నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు
- పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలంటున్న బొమ్మసాని
- తనకే మైలవరం సీటు అడిగే అర్హత ఉందంటున్న బొమ్మసాని
9:55 AM, Mar 7th, 2024
రాజకీయంగా బాబు అండ్‌కోను గోతిలో పాతిపెట్టండి: కొడాలి నాని
- సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎనీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా కలిసి వస్తున్న చంద్రబాబు అండ్‌కోను రాబోయే ఎన్నికల్లో గోతిలో పాతి పెట్టాలి
- పనికి రాని లోకేశ్‌ను గెలిపిస్తే.. పెద్ద ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు
- పుట్టిన రోజు, చావు రోజుకు తేడా తెలియని లోకేశ్‌ను సీఎం చేయాలనే దురుద్ధేశంతో జూనియర్ ఎన్టీఆర్‌పై అనేక కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు
- 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ.2.50లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన సీఎం జగన్ కోసం రెండు సార్లు ఈవీఎం బటన్‌ను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి
8:41 AM, Mar 7th, 2024
చంద్రబాబు, పవన్ అన్యాయం చేశారు..
- కృష్ణాజిల్లా: పెడన సీటు విషయంలో పట్టువీడని జనసేన కార్యకర్తలు
- చంద్రబాబు, పవన్ తమకు అన్యాయం చేశాడంటున్న జనసేన నాయకులు
- బూరగడ్డ వేదవ్యాస్‌ను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి తెస్తున్న పెడన కాపు సామాజికవర్గం జనసేన నేతలు
- చంద్రబాబుపై మండిపడుతున్న జనసేన నాయకులు చలంకుర్తి పృథ్వీ ప్రసన్న
- చంద్రబాబు, పవన్ పెడన సీటు విషయంలో పునరాలోచించుకోవాలి
- పొత్తు పేరుతో 24 సీట్లు కేటాయించి అన్యాయం చేశారు
- చంద్రబాబు అరెస్టయ్యాక టీడీపీ పార్టీ చచ్చిపోయింది
- మా నాయకుడు చెప్పగానే చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలు ధర్నాలు చేశారు
- మాకు న్యాయం చేయకపోతే చంద్రబాబు, పవన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు
- చంద్రబాబు కమ్మ వారి సీట్లలో కమ్మ వారికి ఇచ్చారు
- కాపుల సీట్లలో బీసీలకు కేటాయించారు
- కాపులు, బీసీలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు
- మొన్నటి వరకూ జనసేన అని ధైర్యంగా చెప్పుకుని తిరిగాం
- కేవలం 24 సీట్లకు పరిమితం చేసి జనసేన పార్టీని చంద్రబాబు అవమానించారు
- టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చిన మా నాయకుడిని చిన్నచూపు చూస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ ఇప్పటి వరకూ ప్రకటించిన సీట్లలో 21 మంది కాపులకు అవకాశం కల్పించింది
- చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లలో కాపులకిచ్చింది నాలుగు మాత్రమే
- సంఖ్యాబలంలో అధికులమైన కాపులను చిన్నచూపు చూస్తున్నారు
- కృష్ణాజిల్లాలో పెనమలూరు, గుడివాడ, గన్నవరం కమ్మవారికి ఇచ్చారు
- కాపులు ఎక్కువ ఉన్న మచిలీపట్నం,పెడన బీసీలకు ఇచ్చారు
- 49 వేల పైచిలుకు కాపు ఓట్లున్న పెడన సీటు కాపులకే ఇవ్వాలి
- వేదవ్యాస్‌కు ఇస్తే జనసేన అండగా నిలుస్తుంది
- రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించిన బూరగడ్డ వేదవ్యాస్
7:49 AM, Mar 7th, 2024
ఢిల్లీ: బీజేపీ-టీడీపీ పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్
- నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు
- పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురందేశ్వరి
- ఈ రోజు మరోసారి హై కమాండ్ తో సమావేశం అవుతామని వెల్లడి
- ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ టీడీపీ లీకులు
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను తయారు చేస్తున్న బీజేపీ
- నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన
- నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం
- అరకొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదంటున్న ఏపీ బీజేపీ నేతలు
7:42 AM, Mar 7th, 2024
ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు
- సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
- బీజేపీ పెద్దలను కలవనున్న టీడీపీ అధినేత
- బీజేపీతో పొత్తు, ఎన్డీయేలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందంటున్న టీడీపీ వర్గాలు.
7:33 AM, Mar 7th, 2024
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు దురుద్దేశపూరితమే: ఎంపీ విజయసాయిరెడ్డి
- ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎటువంటి గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పినట్టు స్పష్టమవుతోంది
- వాటిని ప్రజలు నమ్మరు
- సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం
- సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చారు
- వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించి బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికాభివృద్ధి చెందేలా పాలన సాగించారు
- గత ప్రభుత్వంతో పోలిస్తే తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లోనే ఉంది
- అది తెలిసి కూడా రాష్ట్రం వెనుకబడి ఉందని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితం
- సిద్ధం సభలకు విశేష స్పందన లభిస్తోంది
- రాష్ట్ర ప్రజల్లో వైఎస్సార్‌సీపీ పట్ల ప్రేమ, అభిమానం మరింత అధికమైంది
- ఇక్కడ పుట్టి పెరిగిన తనకు ఈ జిల్లాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు
- 7:20 AM, Mar 7th, 2024
- ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా
- ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం.. నిజంగా నా అదృష్టం
- వెలిగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
- వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి
- పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
- ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కూడా..
- రూ.1,200 కోట్లతో ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్
- ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు
- రూ.53 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
- గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు
- :15 AM, Mar 7th, 2024
- విప్లవ భేరి
- రాష్ట్రంలో 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన
- విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్
- తొలి కేబినెట్ ఏర్పాటుతోనే సామాజిక విప్లవం ఆవిష్కరణ
- మేనిఫెస్టోయే దిక్సూచి.. 99 శాతం హామీల అమలుతో విశ్వసనీయత
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్
- వివక్ష, లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు జమ
- ఈ సొమ్ము సద్వినియోగంతో 11.77 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం
- గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు
- స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- ఇందులో ఈ 58 నెలల్లో నియమించినవే 2.13 లక్షలు
- ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ
- నాడు–నేడుతో పాఠశాలలకు కొత్త రూపు.. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్
- అమ్మ ఒడితో ప్రభుత్వ పాఠశాలల్లో 98.73 శాతానికి పెరిగిన విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి
- కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం
- ఆరోగ్యశ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జనన్న ఆరోగ్య సురక్షతో నాణ్యమైన వైద్య సేవలు
- సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామి.. పారిశ్రామికాభివృద్ధి వేగవంతం
- ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం
- జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే ఈ విప్లవం కొసాగాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు, మేధావులు
- 7:06 AM, Mar 7th, 2024
- టీడీపీలో కొత్త కష్టాలు
- వలస నేతలతో ఉన్న నేతలకు గండం
- వేమిరెడ్డి రాకతో సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి సీట్లు గల్లంతు
- సోమిరెడ్డికి బదులు సర్వేపల్లిలో రూప్‌కుమార్‌కి సీటివ్వాలని వేమిరెడ్డి పట్టు
- కోవూరు సీటును తన సతీమణికి ఇప్పించేందుకు ప్రయత్నాలు
- లావు శ్రీకృష్ణదేవరాయలు చేరికతో యరపతినేని, అరవింద్‌బాబు సీట్ల కిందకు నీరు
- గుమ్మనూరు జయరాం దెబ్బకు జితేంద్ర గౌడ్.. సారథి ప్రభావంతో ముద్దరబోయినకు చెక్
- ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి తమను అవమానిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం
- 7:04 AM, Mar 7th, 2024
- మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం
- కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్?
- బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకూ ప్రకటించాల్సిందే..
- 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమే
- కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సింది
- మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారు
- ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారు
- అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉంది
- టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందే
- ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ
- 6:51 AM, Mar 7th, 2024
- మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం..
- బీసీల కోసం మరో వేషం
- వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు
- గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి రూ.1.76 లక్షల కోట్లు
- బీసీలంటే ‘బ్యాక్ బోన్’ అన్న వైఎస్సార్‌సీపీ స్లోగన్‌నే కాపీ కొట్టిన టీడీపీ
- బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే
- బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. ఇలా అన్నీ కాపీనే
- అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు
- నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం ఇస్తామన్న బాబు
- 50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
- అభాసుపాలైన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ బీసీ డిక్లరేషన్