#Uncategorized

Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలను కలిసే అవకాశం.. పొత్తులపై కీలక ప్రకటన..!

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజు హాజరై ఏపీలో బీజేపీ తరపున 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజు హాజరై ఏపీలో బీజేపీ తరపున 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అర్థరాత్రి దాకా సాగిన చర్చల తర్వాత పురందేశ్వరి, సోము వీర్రాజు చర్చల వివరాలు తెలిపారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రైవేట్ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు బీజేపీ హైకమాండ్‌ నుంచి ఇంకా ఎలాంటి అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అవలేదని తెలిసింది. అయితే ఆఖరు క్షణంలో బీజేపీ హై కమాండ్‌ నుంచి చంద్రబాబుకు పిలుపు రావచ్చని సమాచారం. చంద్రబాబుతో చర్చలు జరిగాక పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదేసమయంలో అపాయిట్మెంట్ ఫిక్స్ అయితే.. బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీతో పొత్తు, ఎన్డీయేలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు.. బీజేపీ అభ్యర్థుల జాబితాపైనా ఓ స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.

కాగా.. నిన్న చంద్రబాబు నిన్న ఉండవల్లి నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. గంటన్నరపాటు సాగిన సమావేశంలో పొత్తుల అంశంతో పాటు త్వరలో ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు తెలిసింది.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులతో పాటు అభ్యర్థుల జాబితాపై నేడు స్పష్టమైన ప్రకటన వెలువడవచ్చని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *