#political news #Telangan Politics

Ponguleti Srinivas Reddy – నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌, ఖమ్మంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఖమ్మంలో గురువారం వేకువజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ  అధికారులు.. మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నేడు నామినేషన్‌ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసంపై ఐటీ దాడులు జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు రావడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *