Nara Lokesh – వైకాపావి ఫేక్ ఎత్తుగడలు, అప్రమత్తంగా ఉండండి.

కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు.. తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం: తెదేపా
రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ.. చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.