#Telangan Politics #Uncategorized

CM KCR – గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన అందజేశారు. నామినేషన్‌ అనంతరం కేసీఆర్‌ ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *