China : రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన.

సైనిక ఉపగ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందున మరింతగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. బుధవారం చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ జెన్ ఝాంగ్ యుక్సియాతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. ‘అంతరిక్షంతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి విలువైన ఆస్తుల్లో, భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆయుధాల విషయంలో సహకరించుకోవడం ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక భద్రతకు భరోసా లభిస్తుంది. పరోక్ష యుద్ధ నేపథ్యంలో ఎటువంటి సైనిక అలయన్స్‌ను ఏర్పాటు చేయబోవడం లేదు. కానీ పరస్పర సహకారం ద్వారా అంతర్జాతీయ పరిస్థితులను చక్కదిద్దడానికి అవకాశం దక్కుతుంది’ అని చర్చల అనంతరం పుతిన్ ప్రకటించారు.