P.Balasubramanian Menon – 97 ఏళ్ల వయసులోనూ కేసులు వాదిస్తున్నారు

ఆయన వయసు 97 ఏళ్లు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ వయసులో ఆయన ఇప్పటికీ కోర్టుకు హాజరై కేసుల్ని వాదిస్తున్నారు. అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు నాయ్యవాదిగా పనిచేసి, ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ఈ రికార్డును సెప్టెంబరు 11న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. కేరళకు చెందిన ఈ న్యాయవాది పేరు పి.బాలసుబ్రమణియన్ మీనన్. అంత ముదిమి వయసులోనూ మీనన్ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. తన కార్యాలయానికి, కోర్టుకు హాజరవుతూ క్లయింట్లను కలుస్తుంటారు. ‘నాపై పూర్తి నమ్మకంతోనే ఎవరైనా నా వద్దకు వస్తారు. అందుకే వారికోసం నా శాయశక్తులా పనిచేస్తా’’ అని అంటారు సుబ్రమణియన్. మద్రాసు న్యాయ కళాశాలలో లా కోర్స్ పూర్తిచేసిన ఆయన 1950లో న్యాయవాద వృత్తిలో చేరారు. నేటికీ అదే వృత్తిలో కొనసాగుతున్నారు.