Bigg Boss Telugu 7 : స్ హౌస్‌లోకి శివాజీ కుమారుడు..

బిగ్‌బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7) ఉల్టా పుల్టా నిజంగా ఇలానే సాగుతోంది. తీవ్రంగా అరుచుకోవడం.. అంతలోనే కలిసి పోతూ కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇక బిగ్‌బాస్ కూడా టాస్క్‌లతో ఏడిపిస్తూనే సర్ప్రైజ్లతో ఆనందాన్ని నింపుతున్నాడు. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన ఎమోషనల్ సర్ప్రైజ్కు శివాజీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్‌లో కూర్చొని కాఫీ తాగుతున్న శివాజీని డాక్టర్‌తో చెక్ చేయించాలని మెడికల్ రూమ్‌కు రమ్మని పిలిచాడు. అక్కడ డాక్టర్ అతడితో మాట్లాడుతూ.. మీ చేయి ఎలా ఉందని అడిగాడు. వ్యాయామాలు చేస్తున్నారా అని వివరాలు కనుక్కొన్నాడు. ట్రీట్మెంట్ అయిపోయింది.. ఇక వెళ్లండి అని చెబుతూ.. తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగించి డాడ్ అని పిలిచాడు. ఆ డాక్టర్‌గా వచ్చింది మరెవరో కాదు.. శివాజీ కుమారుడు.
తన కుమారుడిని చూసిన శివాజీ (Sivaji) ఆనందంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే అతడిని హగ్ చేసుకుని హౌస్‌లోకి తీసుకువెళ్లాడు. డాక్టర్‌గా మా పెద్దబ్బాయిని పంపి బిగ్‌బాస్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడని కంటెస్టెంట్స్ అందరితో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలవ్వగా.. అది అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇక తాను యూనివర్సిటీకి వెళ్లిపోతున్నానని.. అందుకే చూడడానికి వచ్చినట్లు శివాజీ అబ్బాయ్ చెప్పాడు. మళ్లీ ఎన్ని నెలలకు వస్తానో అని అనగానే.. శివాజీ కంటతడి పెట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి హౌస్‌లోని కంటెస్టెంట్స్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఏదేమైనా హౌస్‌లో శివాజీ కుమారుడి ఎంట్రీతో కొత్త కళ వచ్చింది