#National News

Kerela – భారీ వర్షాలు ఆదివారం రాష్ట్రాన్ని ముంచెత్తాయి

భారీ వర్షాలు ఆదివారం కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అధిక వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పథనంథిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్‌ హెచ్చరికను.. అలప్పుజ, ఎర్నాకులం, పాలక్కడ్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా కేరళలో వర్షాలు పడుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. దక్షిణ తమిళనాడుతో పాటు పొరుగు ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావం ఉండొచ్చని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *