#National News

Pollution: దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు..

దేశ రాజధాని దిల్లీ( Delhi) కాలుష్యం కోరల మధ్య నలిగిపోతోంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరింది. అయితే, జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిచేస్తోంది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేసింది. ఈ పరిస్థితుల మధ్య ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది.

దిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా దిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజనులో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

Pollution: దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు..

Nepal – భారీ భూకంపం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *