Jayashankar Bhupapalalli – కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబం ATM రాహుల్ గాంధీ ట్వీట్.

జయశంకర్ భూపాలపల్లి:కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు రాహుల్ వెళ్లారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. దాదాపు గంటన్నర వారితో రాహుల్ గడిపారు. అయితే కాళేశ్వరం పర్యటన అనంతరం రాహుల్ గాంధీ ఆలోచింపజేసేలా ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ = కేసీఆర్ కుటుంబం ATM కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లాను. నాసిరకం నిర్మాణం కారణంగా పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్తంభాలు కూలినట్లు నివేదికలు వెలువడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టును తమ వ్యక్తిగత ఏటీఎంగా పెట్టుకుని కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.