Khammam – ప్రేమ జంట ఆత్మహత్య.

వైరా;జిల్లాలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున వైరా రిజర్వాయర్ వద్ద ఈ ఘటన జరిగింది. బోనకల్ మండలం రేపల్లెకు చెందిన 17 ఏళ్ల బ్రాహ్మణపల్లి బాలిక, 20 ఏళ్ల యువకుడు చింతల సుమంత్ రిజర్వాయర్ కింద చెట్టుకు ఉరివేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. వారు ఎక్కడా కనిపించకపోవడంతో బోనకల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ రిపోర్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.