#Siddipet District

Siddipet – శివారులో క్షుద్రపూజల ఆనవాళ్లు.

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం, ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటన జరిగిన ప్రదేశంలో, ఒక నల్ల కోడిని కోసి, నిమ్మకాయలు, గుమ్మడికాయ, కొబ్బరి, బియ్యం మరియు రక్షతో పాటు వేప కొమ్మలతో పూజించారు. బుధవారం ఈ విషయాన్ని గుర్తించడంతో పక్కనే ఉన్న కల్వకుంట కాలనీ, రామచంద్రనగర్ వాసులు ఆందోళనకు దిగారు. కేంద్రీయ విద్యాలయం, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రిపూట అదనపు గస్తీ నిర్వహించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *