Peddhapalli – సాయుధ బలగాల కవాతును ప్రారంభించిన కలెక్టర్.
పెద్దపల్లి:కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, బహిరంగ వాతావరణంలో ఓటింగ్ జరగాలన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర సాయుధ బలగాలు ఏర్పాటు చేసిన కవాతును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓటర్లలో ధైర్యాన్ని నింపేందుకు, తమపై ప్రభావం చూపే వారి నుంచి కాపాడేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీపీలు ఎడ్ల మహేష్, తుల శ్రీనివాసరావు, డీసీపీ చేతన, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుమోహన్, ఇతర సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.