Bhuvanagiri – నత్త నడకన సాగుతున్న ఖిలా అభివృద్ధి పనులు.

భువనగిరి : ఖిలా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. గతంలో ప్రకటించిన ఏ ఒక్క ప్రాజెక్టునూ రాష్ట్రం పూర్తి చేయలేదు. ఈలోగా భువనగిరి ఖిలాను జాతీయ వారసత్వ సంపదగా కేంద్రం గుర్తించింది. స్వదేశీ దర్శన్ కింద రెండున్నర నెలల క్రితమే రూ.100 కోట్లు అధీకృతం చేస్తున్నట్లు ప్రకటించింది. డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించింది. కానీ ఇప్పటి వరకు డీపీఆర్ కొలిక్కిరాలేదు.
రెండు నెలల్లో పనులు ప్రారంభం:
వచ్చే రెండు నెలల్లో స్వదేశీ దర్శన్ కింద ఖిలా అభివృద్ధికి కేంద్రం సిఫార్సు చేసిన పనులు ప్రారంభమవుతాయని అంచనా. దీనికి సంబంధించిన డీపీఆర్ ఇందుకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పన తుది దశకు చేరింది.
ఖిలాను సందర్శించిన అధికారులు:
సోమవారం రాష్ట్ర, కేంద్ర పురావస్తు, పర్యాటక శాఖల ప్రతినిధులు భువనగిరి ఖిలాను సందర్శించారు. కోటపై నిర్మాణాలు, ఈత కొలనులు, సమీపంలో నిర్మిస్తున్న సంతోషిమాత ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. ఖిలా అభివృద్ధి కార్యక్రమాలపై భువనగిరి మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక అధికారి కృష్ణవేణితో మాట్లాడారు. సంతోషిమాత ఆలయ నిర్మాణంపై నిర్వాహకులు దేవాదాయ శాఖకు తెలియజేయాలని సూచించారు. ఖిలాను సందర్శించిన వారిలో కేంద్ర పర్యాటక శాఖ ఏడీ కృపాకర్ రావిపాటి, రాష్ట్ర పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి, యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు, పురావస్తుశాఖ డీడీ నారాయణ, ఏడీలు రాజు, ఓంప్రకాష్, బుజ్జి, భువనగిరి ఖిలా ప్రాజెక్ట్ అధికారి గంగాధర్, ఎల్అండ్టీ బృందం సభ్యులు పాల్గొన్నారు.