Medchal – మహిళలపై దాడి చేసిన గంజాయి బ్యాచ్.

మేడ్చల్: సురారం తెలుగు తల్లి నగర్లో యువకులు బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు మహిళలపై దాడి చేశారు. దుకాణాన్ని ఎందుకు మూసివేశారో తమకు తెలియదని అనడంతో యువకులు మహిళలపై దాడి చేశారు.. ఈ సందర్భంగా మద్యం సేవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.స్థానికులు అడ్డుకున్న ఆగని యువకులు అడ్డు వచ్చిన వారిపై పిడిగుద్దులు కురిపించు దాడి చేశారు.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సూరారం పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.