#Entertainment

Netflix – టాప్ 10లో ‘ఖుషి’..

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న థియేటర్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెలరోజులకు అక్టోబర్‌ 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అందులో ప్రసారం అవుతున్నప్పటి నుంచి టాప్‌ వ్యూస్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్‌ 10లో ఒకటిగా నిలిచింది.

ఇండియాలో ఈ వారం ఎక్కువమంది చూసిన చిత్రాల లిస్ట్‌ను తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. అందులో హిందీ భాషలో ‘ఖుషి’ టాప్‌7లో ఉంది. అలాగే తెలుగులో టాప్ 10లో నిలిచింది. ఇక ఈ టాప్10లో మొదటి స్థానంలో ‘డ్రీమ్‌గర్ల్‌2’ ఉండగా రెండులో అక్షయ్‌కుమార్‌ ‘ఓమైగాడ్‌2’ ఉంది. అలాగే నవీన్ పొలిశెట్టి, అనుష్కల ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా టాప్ 5లో ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *