Karimnagar – వైద్య విజ్ఞాన సంస్థలో 20వ వార్షికోత్సవ సంబరాలు

కరీంనగర్ ;శుక్రవారం కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ వైద్యురాలు గౌరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ అనిత, ప్రిన్సిపాల్ అసిమ్ అలీ, డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు.