Hyderabad Miyapur – 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని సీజ్….

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లోని మియాపూర్లో భారీగా బంగారం, వెండి రికవరీ అయింది. ఇవాళ మియాపూర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అవసరమైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.