#Warangal District

Warangal – రూ.2 కోట్ల విలువైన 757 కిలోల గంజాయిని దహనం చేశారు.

ములుగు ;ఎస్పీ గష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు గురువారం రాత్రి నేరగాళ్ల నుంచి పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.2 కోట్ల విలువైన 757 కిలోల గంజాయిని దహనం చేశారు. జిల్లాలోని ములుగు, పస్రా, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు సందర్భాల్లో దొరికిన గంజాయిని ధ్వంసం చేయాలని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశించింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమ కార్యకలాపాల్లో భాగంగా గంజాయి విక్రయించే వారిపై, పట్టణాలు, గ్రామాల్లో యువతను గంజాయితో ప్రలోభపెట్టి మత్తులో కూరుకుపోయే వ్యక్తులను అరికట్టేందుకు పోలీసు అధికారులతో కూడిన రహస్య విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా గంజాయి, ఇతర అక్రమ పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిటీ సభ్యులు: ఏఎస్పీ శిరిశెట్టి, ఏటూరునాగారం ఏఎస్పీ గాష్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్ సంకీర్త్, ఆర్‌ఐ వెంకటనారాయణ, ఎస్సై కమలాకర్, రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్ అడ్మిన్ సతీష్, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ దయాకర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *