Israel – శత్రువుకు శత్రువు మిత్రుడు..

ఈ సూత్రం ఆధారంగానే హమాస్‌కు చేయూతనిచ్చింది ఇజ్రాయెల్. పాలస్తీనా ఏర్పాటు లక్ష్యంగా 1950ల చివర్లో ఏర్పడ్డ ఫతా అనే సంస్థ ఇజ్రాయెల్‌పై సాయుధ దాడులకు సిద్ధమైంది. దీని అధిపతి యాసర్ అరాఫత్. తర్వాతి కాలంలో ఆయన సారథ్యంలోనే అనేక అరబ్ గ్రూపులు కలిసి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌గా (పీఎల్‌వో) ఏర్పడ్డాయి. ఇది మత ఛాందస సంస్థ కాదు. లౌకిక జాతీయవాద, వామపక్ష సంస్థ. 1969లో పీఎల్‌వో ఛైర్మన్ అయిన అరాఫత్ 2014లో చనిపోయేదాకా ఆ పదవిలో ఉన్నారు. మొదట్లో సాయుధ బాటలో ఇజ్రాయెల్‌కు ఇబ్బందులు సృష్టించింది పీఎల్‌వో. అంతేగాకుండా అంతర్జాతీయ సమాజం ముందు పాలస్తీనా గళాన్ని బలంగా వినిపించింది. అరబ్‌లీగ్‌తో పాటు, ఐక్యరాజ్య సమితి పీఎల్‌వోను పాలస్తీనీయుల చట్టబద్ధ ప్రతినిధిగా గుర్తించాయి. అలా ఇజ్రాయెల్‌కు అరాఫత్, పీఎల్వోలు కంట్లో నలుసుగా మారాయి. దీంతో ఈ పీఎల్‌వో, అరాఫత్‌ను బలహీన పరచాలని ఇజ్రాయెల్ ఆలోచించిం