Google – క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోండి..

గూగుల్ క్రోమ్ వినియోగదారులను కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ- ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ అప్రమత్తం చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే.. వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పాత బ్రౌజర్‌లో లోపాలు ఉన్నాయని, ఫలితంగా సైబర్ నేరగాళ్లు రిమోట్‌గా కంప్యూటర్‌ను యాక్సెస్ చేసుకునే ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది.