Bhadradri – బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చంద్రుగొండ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుస్తకాలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో సుధీర్ ఇంట్లో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దీనిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.