#Entertainment

‘Vidhi’ – రోహిత్‌ నందా, ఆనంది జంటగా

రోహిత్‌ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘విధి’. శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. ఎస్‌.రంజిత్‌ నిర్మించారు. ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో హీరో విష్వక్‌ సేన్‌ ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్మాత రంజిత్‌ నాకు మంచి మిత్రుడు. నాకూ తనలాంటి బ్రదర్‌ ఉంటే బాగుండనిపిస్తుంది. ఆనంది ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. ఎంతో ప్రాధాన్యత ఉంటేనే ఓకే చేస్తుంది. నవంబరు 3న విడుదల కానున్న ఈ చిత్రం పెద్ద హిట్టవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. దీనికోసం అందరం వందశాతం కష్టపడి పని చేశాం. కచ్చితంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు దర్శకులు శ్రీకాంత్‌, శ్రీనాథ్‌. నిర్మాత రంజిత్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర కథ.. కథనాన్ని ఎవరూ ఊహించలేరు. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ సాగుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్‌, ఆనంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *